- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కుటుంబంలో తీవ్ర విషాదం నింపిన కరోనా.. 4 రోజుల వ్యవధిలో ముగ్గురు మృతి

దిశ, నల్లగొండ: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా భయంకరంగా పెరుగుతోంది. మరీ ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విలయతాండవం చేస్తోంది. తాజాగా.. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఎర్రసానిగూడెంలో తీవ్ర విషాదం నిపింది. నాలుగు రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని బలి తీసుకుంది. గ్రామానికి చెందిన యాదయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడు.
ఆయన కుటుంబంతో సహా పానగల్ అర్బన్ ఆస్పత్రి సమీపంలో నివసిస్తూ అన్నెపర్తి ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహించేవాడు. యాదయ్య భార్య ఉప్పలమ్మ హౌస్ వైఫ్‌గా ఇంటి వద్దనే ఉండేది. ఇటీవల కరోనా సోకి ఉపాధ్యాయుడు యాదయ్య ఈ నెల 16వ తేదీన, ఆయన తండ్రి 17వ తేదీన మృతిచెందారు. ఈ నెల 20న యాదయ్య భార్య ఉప్పలమ్మ మృతిచెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అంతేగాకుండా.. ప్రస్తుతం వారి ఇద్దరి పిల్లలు కూడా కరోనాతో పోరాడుతున్నారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబంలో ముగ్గురు మహమ్మారి బారిన పడి మృత్యువాత పడటంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.