గోదావరిలో మునిగి ముగ్గురు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం

by Sridhar Babu |   ( Updated:2021-03-19 05:08:58.0  )
గోదావరిలో మునిగి ముగ్గురు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం
X

దిశ,వెబ్ డెస్క్:గోదావరి స్నానాలు ముగ్గురిని బలితిసుకున్నాయి. భద్రాచలం గోదావరిలో మునిగి ఇద్దరు మృత్యువాతకు గురి అయ్యారు.స్నానాలకు వెళ్లిన ఐదుగురి లో ముగ్గురు మృతి చెందారు.మరో ఇద్దరిని స్థానికులు కాపాడారు.వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.తూర్పు గోదావరి జిల్లా మండవక మండలం కు చెందిన కొన్ని కుటుంబాలు భద్రాచలం పట్టణంలో అయ్యప్ప కాలనీలోని బంధువుల ఇంటికి వచ్చారు.శుభకార్యం లో పాల్గొనేందుకి వచ్చిన వారిలో కొందరు గోదావరి లో స్నానాలకు వెళ్లారు.వారి లో ప్రమాదవ శాత్తు నీటిలో మునిగారు. మృతులలో ఇద్దరు మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. జరిగిన సంఘటన భద్రాద్రిలో కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story