- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షాకింగ్… శ్రీకాకుళంలో మూడు కరోనా కేసులు
భారతదేశంలో కరోనా ప్రవేశించి సుమారు రెండు నెలల కాలం గడుస్తోంది. దేశంలో కరోనా వ్యాప్తి నిరోధానికి లాక్‌డౌన్ విధించి సుమారు నెల రోజులు దాటింది. ఇన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పొడ సోకని జిల్లాలేవైనా ఉన్నాయంటే.. అవి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలే కావడం విశేషం. దీనిపై ఆ రెండు జిల్లాల వాసులు గర్వపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రెండు జిల్లాల్లో కరోనా సోకకపోవడంపై హర్షం వ్యక్తం చేసింది. ఇప్పుడా ఆనందం లేకుండా శ్రీకాకుళం జిల్లాలో కరోనా రక్కసి ప్రవేశించింది. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం మండలంలో 3 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు అధికారులు అధికారిక ప్రకటన చేశారు. దీంతో ఆ జిల్లా వాసుల్లో ఆందోళన నెలకొంది.
శ్రీకాకుళం జిల్లా నుంచి లక్షల సంఖ్యలో పలువురు వివిధ ప్రాంతాలకు వలస వెళ్లి జీవనం సాగిస్తుంటారు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో వారంతా వివిధ మార్గాల ద్వారా స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఆంక్షలు విధించిన తరువాత కూడా పలువురు జిల్లాకు వచ్చారు. వారి ద్వారానే కరోనా జిల్లాలో సోకిందని అధికారులు చెబుతున్నారు. ఆ ముగ్గురినీ క్వారంటైన్‌కు పంపించారు. వారి ట్రావెల్ రికార్డుతో పాటు వారు కలిసిన వారిని కూడా క్వారంటైన్‌లో ఉంచారు.
tags:srikakulam district, pathapatnam, coronavirus positive, 3 cases