కరోనా నిబంధనలు పాటించకుంటే ఫ్లైట్ నుంచి డిబోర్డ్

by Shamantha N |
కరోనా నిబంధనలు పాటించకుంటే ఫ్లైట్ నుంచి డిబోర్డ్
X

న్యూఢిల్లీ : విమాన ప్రయాణికులు కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఓ సర్క్యూలర్‌లో తెలిపింది. ఫ్లైట్ ఎక్కిన తర్వాత కూడా ఈ నిబంధనలు ఉల్లంఘించినట్టు తెలిస్తే వారిని డీబోర్డ్(దింపేస్తామని) చేస్తామని స్పష్టం చేసింది. అనేకసార్లు హెచ్చరించినా మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడాన్ని అనుసరించకుంటే క్రమశిక్షణలేని ప్రయాణికుడిగా పరిగణించి సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్‌లోని సంబంధిత సెక్షన్‌ల కింద చర్యలు తీసుకుంటుందని వివరించింది. ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించినప్పటి నుంచి గమ్యస్థానం చేరి విమానాశ్రయం నుంచి బయటికి వచ్చే వరకు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. కొందరు ప్రయాణికులు ముక్కును కవర్ చేయకుండా మాస్కును కిందికి లాగేస్తున్నారని, మరికొందరు ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించిన తర్వాత భౌతిక దూరాన్ని పాటించడం లేదని తెలిసినట్టు పేర్కొంది. ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని వివరించింది.

Advertisement

Next Story

Most Viewed