బాబాఖాన్ మృతికి అసలు కారణం ఇదే!

by Sumithra |
బాబాఖాన్ మృతికి అసలు కారణం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్ : బాబాఖాన్ పూర్తి ఆరోగ్యవంతుడు. కష్టజీవి. డబ్బులకు కొదవలేదు. ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన బాబాఖాన్.. హఠత్తుగా ఓ రోజు రాత్రి గుండెపోటుతో మరణించాడు. శోకసంద్రమైన భార్య.. విషయాన్ని బంధువులకు తెలిపింది. అందరూ వచ్చి బాబాఖాన్ ఖననానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ అందులో ఒకరికి బాబాఖాన్ మృతిపై అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అతడి మరణానికి గుండెపోటు కాదని తేల్చేశారు. ఇంతకు బాబాఖాన్ ఎలా చనిపోయాడు? సంచలన విషయాలు ఎలా బయటపడ్డాయి? హంతకులు ఎవరో తెలుసుకుందాం రండి!

పదేళ్ల క్రితం బాబాఖాన్‌కు జహేదాబేగంతో నిఖా అయింది. వారికి ఇద్దరు సంతానం. స్వగ్రామం బీహార్‌లోని నౌబత్‌పూర్. అక్కడే ఓ పెయింటింగ్ షాప్‌లో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. డబ్బులకు కూడా ఇబ్బంది లేదు. అయితే బాబాఖాన్‌కు మద్యం తాగడం అలవాటు. పని ముగిసిన వెంటనే రోజు తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. తాగితే ఆరోగ్యం కరాబు అవుతుందని, డబ్బులు వృథా అవుతుందని భార్య జహేదాబేగం ఎంత నచ్చజెప్పినా బాబాఖాన్ తాగుడు మానుకోలేదు. దీంతో విసిగిపోయిన ఆమె పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. బంధువుల సహకారంతో భార్యను బతిమిలాడి మళ్లీ కాపురానికి తీసుకొచ్చుకున్నాడు.

కాపురానికి వచ్చిన ఆమె.. భర్తలో ఏం మార్పు రాలేదని గుర్తించింది. మళ్లీ రోజు తాగి వచ్చి విసిగిస్తున్న బాబాఖాన్‌పై కోపంతో గ్రామానికి చెందిన యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త తాగి వచ్చి నిద్రపోగానే ప్రియుడితో ఇంట్లోనే రాసలీలల్లో మునిగితేలేది. ఓరోజు మధ్యలో నిద్రలేచిన బాబాఖాన్.. భార్య మరొకరితో శృంగారంలో ఉండగా చూశాడు. భర్తను చూసిన ప్రియుడు అక్కడి నుంచి పరారీ అయ్యాడు.

ఎప్పటికైనా తన సంబంధానికి భర్త అడ్డువస్తాడన భావించిన జహేదాబేగం.. అతడిని అడ్డుతొలగించాలని ప్రియుడిని కోరింది. ఆమె కోరిక మేరకు ముగ్గురు స్నేహితులతో వచ్చిన ప్రియుడు బాబాఖాన్ నిద్రపోతున్న సమయంలో దిండుతో అదిమి హత్య చేశారు. తెల్లారి ఏమి తెలియనిదానిలా తన భర్త గుండెపోటుతో చనిపోయాడని బంధువులకు కబురు పెట్టింది. కానీ మృతుడి బంధువుల ఫిర్యాదుతో కథ అడ్డం తిరిగింది. పోలీసులు జహేదాబేగంను అదుపులోకి తీసుకోని తమదైన శైలిలో ప్రశ్నించడంతో హత్య చేసిన తీరును వివరించింది. పోలీసులు జహేదాబేగంతోపాటు ఆమె ప్రియుడు, హత్యకు సహకరించిన అతడి స్నేహితులను అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed