- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆ ఆలయం ఆల్‌టైమ్ రికార్డ్.. ఒక్క రోజులో హుండీ ఆదాయం ఎంత వచ్చిందంటే?

దిశ,వెబ్‌డెస్క్: తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తారు. ఈ క్రమంలో శ్రీకాళహస్తీశ్వర వాయు లింగేశ్వర స్వామి వారిని నిత్యం వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. స్వామివారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. స్వామి వారు స్వయంభుగా వెలసిన క్షేత్రం కావడంతో ఇక్కడ నిత్యం విశేష పూజా కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. రాహు-కేతు దోషాల నివారణార్థం భక్తులు పూజలు చేస్తుంటారు.
ఈ క్రమంలో భక్తులు స్వామి వారికి ముడుపుల రూపంలో కానుకలను ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీలో సమర్పిస్తారు. ఆలయ మహాద్వారం మొదలుకొని గర్భాలయాల్లో హుండీని ఏర్పాటు చేశారు. ఈ హుండీలో సమర్పించిన కానుకలను ప్రతి మాసంలో ఒకసారి లెక్కింపు చేస్తారు. ఇలా లెక్కింపు ప్రక్రియని ఆలయ సిబ్బంది, సెక్యూరిటీ, అవుట్ సోర్సింగ్ సిబ్బంది లెక్కింపు చేపడతారు. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీకాళహస్తి ఆలయ హుండీల లెక్కింపు ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించింది. ఒక్కరోజులో రూ.1.02 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.