- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టోక్యో ఒలింపిక్స్‌కు ఎంపికైన చెన్నై కానిస్టేబుల్
దిశ, ఫీచర్స్ : చెన్నైలోని రామ్‌నాడ్‌లో జన్మించిన నాగనాథన్ చిన్ననాటి నుంచే పరుగెత్తడంలో ఉత్సాహం చూపించేవాడు. వాహనాలతో పోటీపడుతూ తన రేసింగ్ సామర్థ్యాన్ని చూసి తనలో తానే మురిసిపోయేవాడు. పేదరికంలో పెరిగిన నాగనాథన్, ప్రభుత్వ బడుల్లోనే చదువుకుంటూ, సెలవు రోజుల్లో కూలీ పనికి వెళ్లేవాడు. అలా ఎన్నో కష్టాలు అనుభవిస్తూనే.. ‘ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్’ ఉద్యోగం సాధించాడు. ఆ నాడు చెప్పుల్లేకుండా పరుగెత్తిన కాళ్లే.. రాబోయే టోక్యో ఒలింపిక్స్ ట్రాక్‌పై ఉరకలెత్తనున్నాయి. ఒలంపిక్స్ 4 x 400 రిలేలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికైన నాగనాథన్, తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు.
నాగనాథన్ తండ్రి పాండి.. రామ్‌నాడ్ జిల్లాలోని సింగపులియపట్టిలో వ్యవసాయ కూలీ. నలుగురు పిల్లలకు తండ్రి ఆదాయమే దిక్కు. దాంతో చదువుకుంటూనే, కూలీ పనులుచేస్తూ కుటుంబానికి ఆర్థికంగా సాయం చేశాడు నాగనాథన్. పాఠశాల స్థాయిలో రన్నింగ్ రేసుల్లో పార్టిసిపేట్ చేసే సయమంలో బూట్లు కొనడానికి డబ్బులు లేకపోవడంతో ఒట్టి పాదాలతోనే పరుగులెత్తి తన సత్తా చాటేవాడు. జిల్లా స్పోర్ట్స్ మీట్‌లో పాల్గొన్నప్పుడు నాగనాథన్ ప్రతిభను మెచ్చిన స్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఒక జత బూట్లు బహుమతిగా అందించాడు. ఇంటర్ తర్వాత బీఏ హిస్టరీ చేసిన అతడు తన చివరి సంవత్సరంలో స్పోర్ట్స్ కోటా ద్వారా పోలీస్ కానిస్టేబుల్‌గా ఎన్నికయ్యాడు.
జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన సీఎం ట్రోఫీలో బంగారు పతకంతో పాటు, అదే ఏట జరిగిన అఖిల భారత పోలీసు మీట్‌లో మొదటి ర్యాంకు సాధించాడు నాగనాథన్. ఈ క్రమంలోనే 2019 నుంచి ‘రన్నింగ్’ ట్రాక్ వైపు మరింత శ్రద్ధగా అడుగులు వేయడం ప్రారంభించాడు. పేదరికంలో పుట్టిన అతడిని ఇప్పటికీ కష్టాలు వెంటాడుతున్నాయి. తన జీతంలో కొంత ఇంటికి పంపిస్తూనే తన అథ్లెటిక్ శిక్షణ అవసరాలను తీర్చుకుంటున్నాడు.
‘నా చిన్నప్పటి నుంచి ఒక పెద్ద క్రీడా కార్యక్రమంలో పాల్గొనాలని కలలు కనేవాడ్ని. కానీ ఒలింపిక్స్‌లో పాల్గొంటానని ఎప్పుడూ ఊహించలేదు. నిజంగా ఇది మర్చిపోలేని రోజు. నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. మేఘాల్లో తేలిపోతున్నాను. ఫిబ్రవరిలో పాటియాలాలో జరిగిన ఫెడరేషన్ కప్‌లో పాల్గొని, రెండో స్థానాన్ని దక్కించుకోవడంతో నాకు ఈ ఆహ్వానం అందింది. భారత జట్టులో పాల్గొనడానికి 45 రోజుల శిక్షణ తర్వాత, టోక్యో ఒలింపిక్స్ కోసం ఫైనలిస్టుల జాబితాలో చోటు దక్కించుకున్నాను. నేను పోలీస్ విభాగంలో చేరేవరకు నాకంటూ ప్రత్యేక కోచ్ లేడు. ఇక్కడికి వచ్చాకే నా నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాను. నా విజయానికి కారణమైన సబ్ ఇన్స్పెక్టర్స్ ఆఫ్ పోలీస్ (స్పోర్ట్స్ ఇంచార్జ్) పాల్ డొమినిక్, శివలింగాలతో పాటు పోలీసు కోచ్ ప్రభాకరన్‌లకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.
‘చాలా ఏళ్ల తర్వాత చెన్నై పోలీసులు ఒలింపియన్‌ను తయారు చేస్తున్నారు” అని డొమినిక్ గుర్తు చేసుకోగా, మూడుసార్లు ఒలింపిక్స్ పతక విజేత రంగనాథన్ ఫ్రాన్సిస్ తర్వాత గ్రేటర్ చెన్నైకి చెందిన వ్యక్తి ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటున్నాడు.