జాగ్రత్త.. భద్రాద్రిలో రాత్రి 9. గంటలకు ప్రమాదం!

by Anukaran |   ( Updated:2020-08-16 04:22:47.0  )
జాగ్రత్త.. భద్రాద్రిలో రాత్రి 9. గంటలకు ప్రమాదం!
X

దిశ, వెబ్‌డెస్క్: భద్రాచలంలోని గోదావరి ఉధృతిపై కేంద్ర జల సంఘం హెచ్చరించింది. భద్రాచలంలో రాత్రి 9 గంటల ప్రాంతంలో ప్రమాదకర స్థాయి దాటే అవకాశం ఉందని హెచ్చరికలు చేసింది. కావున అప్రమత్తంగా ఉండాలని కేంద్ర జల సంఘం సూచనలు చేయడం ఆందోళకరం.

అయితే, అర్థరాత్రి 1.50 గంటలకు వరద 53 అడుగుల‌కు చేరుకోవ‌డంతో మూడో ప్ర‌మాద హెచ్చ‌రిక జారీ చేసిన‌ట్లు కలెక్టర్ డా ఎంవీ రెడ్డి ఒక ప్ర‌క‌ట‌నలో తెలిపారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద 13.80 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. ఆదివారం ఉద‌యం నుంచి క్ర‌మంగా పెరుగుతూ వ‌స్తుండ‌టం గ‌మ‌నార్హం.

ఆదివారం ఉదయం 9 గంటలకు 50 అడుగులు దాటింది. 48 అడుగుల దాట‌డంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 53 అడుగులు చేరుకోవ‌డంతో మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఆదివారం ఉదయం నుంచి ఇంద్రావతి వ‌ర‌ద నీరు జ‌త క‌ల‌వ‌డంతో గోదావరి ప్ర‌వాహం పెరిగింది. మేడిగడ్డ నుంచి వ‌చ్చే వ‌ర‌ద సాయంత్రం నాటికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పేరూరు, ఏటూరునాగారం, దుమ్ముగూడెం, భద్రాచలం వద్ద గోదావరి ఉధృతిలో ఉంది. దీంతో అటు కేంద్ర జల సంఘం అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed