ఇండ్లు ఇవ్వకపోతే సూసైడ్‌ చేసుకుంటారు.. ఎంపీటీసీ సంచలన వ్యాఖ్యలు

by Shyam |
ఇండ్లు ఇవ్వకపోతే సూసైడ్‌ చేసుకుంటారు.. ఎంపీటీసీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, దుబ్బాక: దుబ్బాక మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం సోమవారం రసాబాసగా కొనసాగింది. ఎంపీపీ కొత్త పుష్పలత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండలంలోని సమస్యలను.. ప్రజాప్రతినిధులు లేవనెత్తినప్పుడు అధికారులు ఎంత మాత్రం పట్టించుకోవడం లేదు. పూర్తిగా నిర్లక్ష్యపు సమాధానాలు చెప్పారు. ఏదో వంతుకు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు తప్పా, సరైన సమాధానం చెప్పిన పరిస్థితులైతే కనబడలేదు.

ఇండ్లు ఇవ్వకపోతే ఆత్మహత్యలే..

తిమ్మాపూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి మూడు సంవత్సరాలు గడుస్తున్నా.. పేదలకు ఇళ్ల పంపిణీ చేయడం లేదంటూ ఆ గ్రామ ఎంపీటీసీ రామవరం మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ త్వరగా చేపట్టకపోతే లబ్ధిదారులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు సిద్ధ పడుతారని హెచ్చరించారు. పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎందుకు పంపిణీ చేయడం లేదో అర్థం కావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు రవీందర్, ఏఎంసీ చైర్మన్ శ్రీలేఖ, పీఎసీఎస్ చైర్మన్ కౌలాసం, ఎంపీడీఓ భాస్కర్, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed