- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గంటలో పని కానిచ్చేశారు.. బోరుమని కన్నీరు పెట్టిన మహిళ

X
దిశ, కుత్బుల్లాపూర్ : తాళాలు ధ్వంసం చేసి నగదు, నగలు దోచుకెళ్లిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై నర్సింహులు, బాధితుల కథనం ప్రకారం.. గాజులరామారం సర్కిల్ నెహ్రూ నగర్‌కు చెందిన ముత్యాలమ్మ గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంటికి తాళం వేసి ఎలమ్మబండకు స్వంత పనులపై వెళ్లింది. గంట తర్వాత తిరిగి వచ్చే సరికి ఇంటి తాళం ధ్వంసం చేసి తలుపులు తీసి ఉన్నాయి.
దొంగతనం జరిగినట్లు గుర్తించి.. లోపలికి వెళ్లి చూడగా బీరువా తలుపులు తెరుచుకుని ఉండడంతో అందులో చూడగా 5 గ్రాముల బంగారు ఉంగరం, రూ.20 వేల నగదు కనిపించలేదు. దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Next Story