ఎద్దులు.. మేకలు ఎత్తుకెళ్లిన దొంగలు ఎక్కడా? : తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు

by Sumithra |   ( Updated:2021-11-02 01:51:08.0  )
Mekalu-1
X

దిశ, శంకర్ పల్లి: శంకర్ పల్లి మండలం అంతప్పగూడ గ్రామంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. గ్రామానికి చెందిన గుడిపల్లి చంద్రయ్యకు చెందిన ఆరు మేకలు, హరిజన్ జంగయ్యకు చెందిన ఒక మేకను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు గ్రామాన్ని సందర్శించి దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. ఇదే గ్రామంలో 3 సంవత్సరాల క్రితం కూడా దొంగలు ఎద్దులను ఎత్తుకెళ్లినట్లు గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

Advertisement

Next Story