ఏప్రిల్‌లో విడుదలయ్యే స్మార్ట్ ఫోన్లు ఇవే ..

by Anukaran |   ( Updated:2021-04-07 05:39:39.0  )
Cell Phones
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ సెల్ కంపెనీలు సమ్మర్ సేల్స్ ను క్యాష్ చేసుకునే దిశగా ప్రయత్నిస్తున్నాయి. వేసవిలో కూల్ కూల్‌గా ప్రత్యేక మోడళ్లను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. ఒప్పో నుంచి ఏప్రిల్ 6న కొత్త మోడల్ విడుదలవ్వగా.. రియల్ మీ, ఒప్పో, సోనీ, నోకియా, రెడ్ మీ తమ బ్రాండ్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. మొబైల్ ప్రియుల కోసం రియల్ మీ, సోనీ, నోకియా అత్యాధునిక ఫీచర్లతో రానున్నాయి. ఏ కంపెనీ ఏఏ మోడల్ ఫోన్లను విడుదల చేస్తోంది చూద్దాం.

ఒప్పో నుంచి F19

Oppo F19

ఇది వరకే ఒప్పో F19 pro ను విజయవంతంగా మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే కాగా, అదే సిరీస్ లో 5000mah బ్యాటరీ సామర్థ్యంతో ఒప్పో F19 ఏప్రిల్ 6న విడుదలైంది. F19 33W ఫ్లాష్ ఛార్జ్ పరిజ్ఞానంతో నిమిషాల్లో ఫోన్ బ్యాటరీ నిండేలా తయారు చేశారు. అంతే కాకుండా ఇందులో కళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అమోల్డ్ FHD+ పంచ్ హోల్ డిస్ల్పే ను అమర్చినట్లు ఒప్పో ప్రకటించింది.

రియల్ మీ నుంచి C20, C21, C25

Realme

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయరీ దిగ్గజ సంస్థ ఇప్పటికే C20, C21, C25 ను విదేశీ మార్కెట్లో వీటిని ఆవిష్కరించింది. వీటిని భారత మార్కెట్లో ప్రవేశ పెట్టెందుకు ఏప్రిల్ 8వ తేదీని ఖరారు చేసింది. ఈ మూడు స్మార్ట్ ఫోన్లుకు 6.5 ఇంచుల ఎల్ సీడీ తెరతో పాటు అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ట్రిపుల్ కెమెరా.. 13 మెగా ఫిక్సల్, f/22 ప్రైమరీ( ప్రాథమిక) 2 మెగా ఫిక్సల్ రియర్ సెన్సార్లను అమర్చారు. ఈ మూడింటిలో కన్నా 6000mAhబ్యాటరీ సామర్థ్యంతో 18W ఫాస్ట్ ఛార్జీంగ్ అయ్యేలా C25ను మార్కెట్లోకి తెనున్నారు.

నోకియా నుంచి X,C,G సిరీస్ ఫోన్లు

Nokia

గత కొంత కాలంగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులను అంతగా ఆకట్టుకోలేక పోతున్న నోకియా ఇప్పుడు కొత్త తరహాలో మార్కెట్లను ఆకట్టుకునేందుకు పలు ఫోన్లను ఏప్రిల్ 8 న విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే X,C,G సిరీస్ ఫోన్లు రానున్నాయి. నోకియా X10 & X20, G10 & G20 మరియు 1 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో బేసిక్ మోడల్ ను ప్రవేశపెట్టనుంది. ఇందులో ఆండ్రాయిడ్ 11 Os ను వాడారు.

రెడ్ మీ నుంచి గేమింగ్ ఫోన్ల్

Phones

రెడ్ మీ నుంచి గేమింగ్ ఫోన్లు విడుదల చేయనున్నట్లు వస్తున్న వార్తలను నిజం చేస్తూ సంస్థ ప్రోడక్ట్ డైరెక్టర్ వాంగ్ టెంగ్ త్వరలో ఓ ఈవెంట్ ను ఏర్పాటు చేసి కొన్ని ఫోన్ల ఆవిష్కరణలకు స్వీకారం చుట్టనున్నట్లు తెలిపారు. అయితే అది గేమింగ్ ఫోన్ ఆ కాదా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటి వరకు రెడ్ మీ నుంచి M2104K10c/M2104K10l మోడల్లు రానున్నాయని తెలిసిన విషయమే.

సోనీ నుంచి ఎక్స్ పీరియా

Sony

సోనీ స్మార్ట్ ఫోన్ ప్రేమికులకు ఆ సంస్థ శుభవార్త అందించింది. ఏప్రిల్ 14న సోనీ ఎక్స్ పీరియా 11, 10 మార్కెట్లోకి విడుదల కానున్నాయి.

Advertisement

Next Story

Most Viewed