ఏపీలో రేపటి నుంచి వీటికి లాక్‌డౌన్ లేదు…!

by srinivas |
ఏపీలో రేపటి నుంచి వీటికి లాక్‌డౌన్ లేదు…!
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపటి నుంచి లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుకు సిద్ధమవుతోంది. అయితే ఒక్కసారిగా అన్ని రంగాలకు కాకుండా దశల వారీగా లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తివేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ఆంక్షలు ఏఏ రంగాలకు సడలించవచ్చో వివరిస్తూ చీఫ్ సెక్రటరీ నీలం సహానీ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

ఆమె ఆదేశాల ప్రకారం ఏ ఏ రంగాలకు లాక్‌డౌన్ నుంచి విముక్తి కలిగిందన్న వివరాల్లోకి వెళ్తే… కరోనా రక్షణకు ఉపకరణాలు తయారు చేసే పరిశ్రమలు, ప్రధానంగా విశాఖపట్టణంలోని మెడ్‌టెక్ జోన్‌లోని పరిశ్రమలు తెరచుకోనున్నాయి. అలాగే రైస్ మిల్లులు, పప్పుల మిల్లులు, గ్రామాలు, పట్టణాల్లోని పిండిమరలు, పాలు, చాక్లెట్లు, బేకరీలు, పాల ఉత్పత్తుల పరిశ్రమలన్నీ తెరచుకోనున్నాయి.

అలాగే బొగ్గు, చమురు, గ్యాస్ కంపెనీలన్నీ తెరచుకోనున్నాయి. ఔషధాలు, సబ్బులు, మాస్కులు, బాడీ సూట్లు తయారు చేసే సంస్థలు కూడా తెరచుకోనున్నాయి. ఈ పరిశ్రమలన్నింట్లో కార్మికులు, యాజమాన్యాలు సామాజిక దూరం కచ్చితంగా పాటించాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. అలాగే అన్ని రకాల రవాణా కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చని సీఎస్ స్పష్టం చేశారు.

వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది ఇతర రాష్ట్రాలకు వెళ్లడంపై ఎలాంటి ఆంక్షలు లేవని, వారు ఎక్కడికైనా వెళ్లవచ్చని తెలిపారు. అలాగే ఈ ఆంక్షలు రెడ్‌జోన్‌తో పాటు కంటైన్‌మెంట్ జోన్‌లకు వర్తించవని ప్రకటించారు.

Tags: lockdown free, medical, milk products, gas, corona safety instrument companies, medtech zone

Advertisement

Next Story

Most Viewed