నాలుగో దశ లాక్‌డౌన్ ఉంటుంది: కన్నా

by srinivas |
నాలుగో దశ లాక్‌డౌన్ ఉంటుంది: కన్నా
X

దిశ ఏపీ బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి నాలుగో దశ లాక్‌డౌన్‌ కూడా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రం తీసుకున్న చర్యలతోనే కరోనా కట్టడి అయిందని అన్నారు. పేదల కోసం ప్రధాని మోదీ రెండుసార్లు ప్యాకేజీలు ప్రకటించారని ఆయన చెప్పారు. ఐతే, కేంద్రం ఇస్తోన్న నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు దారి మళ్లిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని స్వాగతిస్తున్నామని అన్నారు. ప్రధాని ప్రకటించిన ప్యాకేజీ దేశంలోని అన్ని రంగాలకు ఊతమిచ్చేదిగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 20 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్యాకేజీ వల్ల దేశంలోని అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పూచీకత్తు లేకుండా రుణాలు ఇవ్వడం శుభపరిణామమని ఆయన చెప్పారు. చేనేతలు, చేతివృత్తుల వారికి కూడా సహకారం అందించేలా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed