మూడు నెలలుగా ఇన్‌ఛార్జిలే.. ఎస్సైలు వచ్చేదెన్నడో.?

by Shyam |   ( Updated:2021-02-06 01:18:27.0  )
మూడు నెలలుగా ఇన్‌ఛార్జిలే.. ఎస్సైలు వచ్చేదెన్నడో.?
X

దిశ, కోదాడ: కోదాడ నియోజకవర్గంలోని అనంతగిరి, నడిగూడెం మండలాల పోలీస్ స్టేషన్లకు ఎస్ఐలు లేక దాదాపుగా మూడు నెలలు అవుతున్నా ఇంత వరకు నూతన ఎస్సైలు రాకపోవడంతో ఆయా మండలాల గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న కేసుల నిమిత్తం స్టేషన్లకు వచ్చినవారు.. ఎస్సైలు లేకపోవడంతో పలు సమస్యలపై వచ్చినా పరిష్కారం కావడం లేదు పరిష్కారం చేసే వారు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక అనంతగిరి మండల స్టేషన్‌కు మేజర్ పంచాయతీలో ఏమైనా వస్తే వారు ఆ స్టేషన్ ఇన్‌చార్జ్ ఎస్సైగా ఉన్న కోదాడ రూరల్ ఎస్ఐ కొరకు పనులు వదులు పెట్టుకొని పట్టణానికి రావాల్సిన పరిస్థితి నెలకొంది ఇక మండలం నడిగూడెం మండల స్టేషన్ ఇంట్లో ఏమైనా కేసుల వస్తే అక్కడ పరిష్కారం కానివి ఇన్‌చార్జ్ మునగాల ఎస్సైగా ఉన్నా ఆ మండలానికి వెళ్లాల్సి పరిస్థితి నెలకొంది. అనంతగిరి ఎస్సై అవినీతి ఆరోపణలపై సస్పెండ్‌గా, నడిగూడెం ఎస్సై ఆ మండల ప్రజాప్రతినిధులతో సఖ్యత లేకపోవడంతో అక్కడినుంచి బదిలీపై వెళ్లారు. దీంతో ఆ రెండు స్టేషన్లు ఎస్సైలు లేకుండా ఖాళీగా ఉన్నాయి.

వారికి కూడా అదనపు భారమే..

అనంతగిరి నడిగూడెం ఇన్‌చార్జ్ ఎస్సైలుగా ఉన్న వారి ఇద్దరు కూడా అధిక పని భారమే అవుతుంది. నియోజకవర్గంలో మేజర్ మండలమైన, పలు సమస్యాత్మక గ్రామాలు, ఉన్న జాతీయ రహదారిపై ఉన్న మునగాల ఎస్ఐకు ఆ మండల విధులు నిర్వర్తించే బాధ్యత ఎక్కువగా ఉంటుంది. దీనికితోడు ఆ ఎస్సైకి నడిగూడెం బాధితులు కూడా అప్పజెప్పడంతో పని ఒత్తిడి ఎక్కువ అవుతున్నట్లే ఇంకా అదే విధంగా కోదాడ రూరల్ ఎస్సై పరిస్థితి కూడా ఇంచుమించు అదే విధంగా ఉంది.

ఎక్కువైన అక్రమ వ్యాపారాలు..

అనంతగిరి స్టేషనుకు ఎస్సై లేకపోవడంతో అక్రమ వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తున్నాయి. చనుపల్లి నుంచి గొండ్రియాల వరకు ప్రవహిస్తున్న పాలేరు వాగు నుంచి అక్రమ వ్యాపారులు ఇసుకను త్వవి తీస్తున్న పట్టించుకునే వారే కరువయ్యారు. ఇక రేషన్ బియ్యం దందా కూడా జోరుగా సాగుతుంది. రెండు మండలాలలో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి, ఆయా కేసులు వేగంగా కదలాలంటే పూర్తి స్థాయి ఎస్సైలు రావాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed