- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రశంసలు అందుకున్న దొంగ.. నెట్టింట వైరల్
దిశ, వెబ్ డెస్క్: అతనో కరుడు గట్టిన దొంగ… అతను దేనిమీదైనా కన్నేశాడంటే అవి మాయమైపోవడం ఖాయం… చేతికి దొరికిందని పట్టుకుపోయి సొమ్ము చేసుకోవడం మాత్రమే అతనికి తెలుసు… అలాగే చేతికి అందింది కదా అని కరోనా వ్యాక్సిన్ బాక్స్ లను ఎంచక్కా ఎత్తుకుపోయాడు. ఇంకేముంది తీరా ఇంటికి వెళ్లి చూస్తే అవి కోవిషీల్డ్ వ్యాక్సిన్ అని తెలుసుకున్నాడు. అరెరే.. భలే పొరపాటు జరిగిందే అనుకోని .. వెంటనే ఒక లెటర్ పై క్షమాపణలు కోరి పోలీస్ స్టేషన్ వద్ద బాక్స్ లను వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ వింత ఘటన హర్యానా రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే..
హర్యానా రాష్ట్రంలోని జింద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 1,700 కోవిడ్-19 వ్యాక్సిన్లు బుధవారం రాత్రి చోరీకి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ కూడా చేపట్టారు కూడా. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం సివిల్ లైన్స్ పోలీసు స్టేషన్ సమీపంలో ఓ బ్యాగ్ ని పోలీసులు గుర్తించారు. ఏంటా అని తెరిచి చూస్తే అందులో కోవ్యాక్సిన్, కోవిషీల్డ్ టీకా డోసులతో పాటు ఓ ఉత్తరం కనిపించింది. ఆ లెటర్ లో “నన్ను క్షమించండి. ఇందులో కరోనా వైరస్ వ్యాక్సిన్ ఉందన్న విషయం నాకు తెలియదు” అని రాసుంది.
ఇక ఆ ఉత్తరం చూసి పోలీసులు నవ్వుకున్నారు. ఏదిఏమైనా దొంగ వాటిని తిరిగి ఇచ్చినందుకు ఆనడం వ్యక్తం చేస్తూ ఆ దొంగను ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఉత్తరం నెట్టింట వైరల్ గా మారింది. యెంత మంచి దొంగవయ్యా! అని కొందరు కామెంట్ చేస్తుంటే… ఈ పనితో ఒక మెట్టు ఎక్కేసావయ్యా! అని మరికొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.