ఆ జిల్లాలో వెన్నులో వణుకు పుట్టిస్తున్న నేరగాళ్లు

by Sumithra |   ( Updated:2021-03-24 05:32:44.0  )
ఆ జిల్లాలో వెన్నులో వణుకు పుట్టిస్తున్న నేరగాళ్లు
X

దిశ, జడ్చర్ల: తాళం వేసి ఉన్న ఇండ్లే లక్ష్యంగా వరుస చోరీలకు పాల్పడుతూ పట్టణ ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తూ వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు దొంగలు.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణలో ఏకకాలంలో మూడు ఇళ్లల్లో చోరీ జరగడం భారీగా నగదు, నగలు అపహరణకు గురి కావడం చర్చనీయాంశంగా మారింది.

పట్టణంలోని నేతాజీ చౌరస్తాలో వేణు గోపాల్ అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చి చూసుకునే లోపే భారీ చోరీ జరిగింది. తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు 50 తులాల బంగారం, ఐదు లక్షల నగదు, రెండు కిలోల వెండి అపహరించారు. క్లబ్ రోడ్ లో విద్యా నగర్ కాలనీలో అనురాధ ఇంట్లో 9 తులాల బంగారం, శ్రీనివాస నగర్ కాలనీలో శివకుమార్ ఇంట్లో వెండి ఆభరణాలు, అపహరణకు గురయ్యాయి. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story