- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రైతు ఇంట్లో దొంగతనం… 5 తులాల బంగారం చోరీ
by Shyam |

X
దిశ, తుంగతుర్తి: యాదాద్రి-భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో శుక్రవారం రాత్రి ఓ రైతు ఇంట్లో దొంగతనం జరిగింది. బాధితుల వివరాల ప్రకారం… పట్టణ కేంద్రంలో నివాసం ఉంటున్న నల్ల మల్లయ్య అనే రైతు రాత్రి ఇంటికి తాళం వేసి, బంధువుల గ్రామమైన కక్కిరేణికి ఫంక్షన్ కోసం వెళ్లారు.
ఇదే అదునుగా భావించిన కొందరు దుండగులు, ఇంట్లో చొరబడి 5 తులాల బంగారం, 70 తులాల వెండి, రూ1000 నగదు చోరీ చేశారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Next Story