- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
థియేటర్లు ఓపెన్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో థియేటర్లు ఓపెన్ అయ్యాయి. చాలా కాలం తర్వాత సినీ లవర్స్ బిగ్ స్క్రీన్‌పై మూవీ ఎక్స్‌పీరియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రసాద్ మల్టీప్లెక్స్, పీవీఆర్ సినిమాస్, ఏఎంబి సినిమాస్ ఆడియన్స్‌కు హార్టీ వెల్‌కమ్ చెప్తూనే..కొవిడ్ -19 జాగ్రత్తలు పాటిస్తూ సేఫ్‌గా సినిమాను సెలబ్రేట్ చేసుకుందామని ఆహ్వానం పలికాయి.
50 శాతం ఆక్యుపెన్సీతో ప్రారంభమైన థియేటర్లలో ఫిజికల్ డిస్టెన్సింగ్, మాస్క్ కంపల్సరీ అని, శానిటైజర్స్ యూజ్ చేయాలని సూచించాయి థియేటర్ యాజమాన్యాలు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత సినిమా హాళ్లు తెరుచుకోగా టాకీస్‌లో సందడి మొదలైంది. హాలీవుడ్ సినిమా టెనెట్ దేశవ్యాప్తంగా రిలీజ్ అయింది. డైరెక్టర్ మారుతి, హీరో సాయి ధరమ్ తేజ్ లాంటి సెలెబ్రిటీలు ఇప్పటికే థియేటర్లకు చేరుకుని..ఇన్నాళ్లు మిస్ అయిన సినిమా ఫన్ ఎంజాయ్ చేయడానికి తరలిరావాలని పిలుపునిస్తున్నారు.
ప్రేక్షకులు కొవిడ్ జాగ్రత్తలు తీసుకుని థియేటర్లకు వస్తే ఎలాంటి ఇబ్బందీ ఉండదని హీరో సాయిధరమ్ తేజ్ చెబుతున్నాడు. ఆయన నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ కొవిడ్ క్రైసిస్ తర్వాత రిలీజవుతున్న అతి పెద్ద సినిమాగా రికార్డులకెక్కబోతోంది. ఈ మూవీని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ప్రజలలో విశ్వాసం పెంపొందించడానికి సుప్రీం హీరో సాయి ధరం తేజ్ థియేటర్లను సందర్శించడంపై ఒక ప్రత్యేక వీడియోను రూపొందించారు. ట్విట్టర్‌లో ఆ వీడియోను పోస్ట్ చేశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్‌ను సందర్శించాడు. మాస్కులు హ్యాండ్ శానిటైజర్ లతో థియేటర్లకు రావడం పూర్తిగా సురక్షితం అని ప్రజలకు సూచించాడు.