- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పట్టణాలు, పల్లెలను కలవరపెడుతోన్న ‘చెత్త’.. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దంటూ నిపుణుల హెచ్చరిక

దిశ, తెలంగాణ బ్యూరో: పట్టణాలు, పల్లెలను చెత్త కలవరపెడుతోంది. ఏండ్ల తరబడిగా పేరుకుపోయిన చెత్త పెద్దపెద్ద గుట్టలుగా తయారైంది. ఈ చెత్త గుట్టలను తొలగించాలంటే భారీ ఖర్చుతో కూడుకున్న పని. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జవహార్ నగర్ డంపింగ్ యార్డు. ఈ యార్డు కారణంగా చుట్టుపక్కల ఉన్న భూమి కలుషితమైంది. చెరువులన్నీ కాలుష్య కారకాలుగా మారాయి. వాతావరణం కలుషితమైంది. పేరుకుపోయిన చెత్తను ప్రాసెసింగ్ చేయకపోతే జవహార్ నగర్ డంపింగ్ యార్డు మాదిరిగానే ఇతర మున్సిపాలిటీల పరిస్థితి మారనుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితి రాకూడదనే పురపాలక శా ఖ చర్యలు తీసుకోవడానికి కసరత్తు చేస్తోంది. పాత చెత్తను పూర్తిగా ప్రాసెసింగ్ చేయడానికి బయోమైనింగ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) పరి ధిలో బయోమైనింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో బయోమైనింగ్ కార్యక్రమాలను ప్రయివేటు ఏజెన్సీలకు ఇవ్వడానికి త్వరలో టెండర్లు పిలవనుంది.
బయోమైనింగ్ ఇలా..
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) మార్గదర్శకాల ప్రకారం, పాత పురపాలక ఘన వ్యర్థాలు, శుద్ధి చేయడం, వేరు చేయడం, లాభదాయకమైన వినియోగం శాస్త్రీయ ప్రక్రియను బయోమైనింగ్ అంటారు. బయోమైనింగ్ అనే ది మట్టి, ప్లాస్టిక్, మెటల్, కాగితం, వస్త్రాలు, నిర్మాణం, కూల్చివేత వ్యర్థ పదార్థాలు, ఇతర ఘన పదార్థాలను వేరు చేయడానికి పర్యావరణ అనుకూల సాంకేతికత పద్ధతి. ఇది సంక్లిష్ట పర్యావరణ సమస్యలకు పరిష్కారాన్ని అంది స్తుంది. వీటితోపాటు రీసైక్లింగ్ లేదా లోతట్టు ప్రాంతాలను చదును చేయడానికి వినియోగి స్తారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో 38 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. దీన్ని బయోమైనింగ్ ద్వారా క్లియర్ చేయడానికి పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది.
9 క్లస్టర్లుగా..
రాష్ట్రంలో 142 మున్సిపల్ కార్పొరేషన్లు, ము న్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో జీహెచ్ఎంసీ మినహాయిస్తే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) పరిధిలో బయోమైనింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మరో 18 మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడడంతో వాటిలో లెగస్సీ వేస్ట్ లేదని అధికారులు గుర్తించారు. ఇక 123 మున్సిపాలిటీల్లో 38లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. వీటిని 9క్లస్టర్లుగా రూపొందించారు. సమీప మున్సిపాలిటీలను కలిపి ఒక క్లస్టర్ గా తయారు చేశారు. ఒ క్కో క్లస్టర్ ను ఒక్కో ఎజెన్సీకి ఇవ్వాలని నిర్ణయించారు.
విద్యుత్ తయారీకి ప్లాన్
రాష్ట్రంలో 143 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. వీటిలో 129 మున్సిపాలిటీలు, 14 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. ఇటీవల కొత్తగా 12 మున్సిపాలిటీలను, మహబూబ్ నగర్, మంచిర్యాల కార్పొరేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జీహెచ్ఎంసీ తరహాలోనే మున్సిపాలిటీల నుంచి వెలువడే చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు ప్రాసెసింగ్ చేయడంతోపాటు ఆర్డీఎఫ్ తో విద్యుత్ తయారు చేసేందుకు విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ భావిస్తోంది. అందుకు క్లస్టర్ల వారీగా చెత్త ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడంతోపాటు వచ్చిన ఆర్డీఎఫ్ తో విద్యుత్ తయారు చేసేవిధంగా పురపాలకశాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు.
గ్రేటర్ వరంగల్‌లో రూ.36 కోట్లతో
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బయోమైనింగ్ ప్రక్రియను ప్రారంభించారు. చెన్నైకి చెందిన లీప్ ఎకో టెక్ సొల్యూషన్స్ అనే కంపెనీ చెత్త శుద్ధీకరణ చేపడుతోంది. రూ.36 కోట్ల వ్యయంతో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. రోజుకు సుమారు 900 మెట్రిక్ టన్నుల చెత్తను శుద్ధి చేస్తున్నారు. మూడు యంత్రాల ద్వారా రాత్రింబవళ్లు చెత్త శుద్ధి జరుగుతోంది. 100 ఎంఎం కన్నా ఎక్కువ పరిమాణం గల వ్యర్థాలు అంటే.. పెద్దపెద్ద ప్లాస్టిక్ బాటిళ్లు, దుస్తుల లాంటివి మొదటి దశలో బయటకు వస్తాయి. తర్వాత దశలో చిన్న సైజులో ఉండే వ్యర్థాలు బయటకొస్తాయి. ఇలా మూడు దశల్లో వచ్చే వ్యర్థాలను.. సిమెంటు పరిశ్రమలకు పంపిస్తారు. 8ఎంఎం కన్నా తక్కువ పరిణామం ఉండే వ్యర్థాలు.. చివరకు సేంద్రీయ ఎరువుగా మారతాయి.