Humanoid Robot: మారథాన్‌లో మనుషులతో పోటీగా పరుగులు పెట్టిన రోబోలు

by D.Reddy |   ( Updated:2025-04-19 11:36:19.0  )
Humanoid Robot: మారథాన్‌లో మనుషులతో పోటీగా పరుగులు పెట్టిన రోబోలు
X

దిశ, వెబ్ డెస్క్: కాలం శర వేగంగా మారుతోంది. ఈ ఆధునిక యుగంలో శాస్త్రసాంకేతికంగా (Technology) ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రసుతం ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) వైపే పరుగులు పెడుతుంది. ఇంజినీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ పరిజ్ఞానాలతో రూపొందించిన రోబోలు దాదాపు అన్ని రంగాల్లోకి ప్రవేశించాయి. రోబోలు మనిషి కంటే వేగంగా, అలసిపోకుండా పని చేస్తాయి. ఎన్నో పనులను అవలీలగా నిర్వహిస్తాయి. దీంతో ఇప్పటికే హోటళ్లల్లో సర్వర్ల దగ్గర నుంచి ఇంటి పనుల వరకు రోబోల వాడకం విపరీతం పెరిగిపోతుంది. తాజాగా మనుషులతో పోటీగా మారథాన్‌లో పరుగులు పెట్టే రోబోలు వచ్చేశాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోన్నాయి.

చైనా (China) రోబోటిక్స్‌, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వంటి రంగాల్లో తన ఆధిపత్యాన్ని సాధించాలని చూస్తోంది. అందుకుతగ్గట్టుగానే అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల హ్యూమనాయిడ్‌ రోబోను తయారు చేసింది. అంతేకాదు, ఈనెల 13న బీజింగ్‌లో నిర్వహించిన యిజువాంగ్ హాఫ్-మారథాన్‌లో ఈ రోబోలు పరుగులు పెట్టాయి. 21 కిలోమీటర్లు పరుగులు పెట్టేందుకు ఈ మారథాన్‌లో వేలాదిమంది రన్నర్లతో పాటు 21 రోబోలు కూడా పోటీపడ్డాయి. ఈ పోటీకి కొన్ని వారాల ముందే వీటిని పరీక్షించారు. డ్రాగన్‌ దేశంలో గతంలో జరిగిన అనేక మారథాన్‌లలో రోబోలు కనిపించాయి. అయితే, మనుషులతో కలిసి పోటీపడటం మాత్రం ఇదే తొలిసారి.

Click For Tweet Post..



Next Story

Most Viewed