- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గర్భం దాల్చిన బాలిక.. అతడితోపాటు మరో ఇద్దరు..!
దిశ, వెబ్‌డెస్క్ : అభంశుభం తెలియని బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడో యువకుడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మైనార్టీ తీరక ముందే గర్భవతిని చేశాడు. మంచిర్యాల జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన యువకుడు సందీప్ అదే గ్రామానికి చెందిన బాలికను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఈ క్రమంలో బాలికను ఏకాంతంగా కలుస్తూ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పకుండా గోప్యంగా ఉంచింది.
కాగా, ఆదివారం సాయంత్రం తీవ్ర రక్తస్రావమై అస్వస్థతకు గురైన బాలికను తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు గర్భవతిగా తేల్చారు. దీనిపై బాలికను గట్టిగా నిలదీయడంతో గత కొన్నాళ్లుగా జరుగుతున్న దారుణాన్ని వెల్లడించింది. దీంతో సందీప్‌పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రాథమికంగా విచారించిన పోలీసులు బాలికపై అత్యాచారానికి పాల్పడిన సందీప్‌తోపాటు అతడికి సహకరించిన సోదరులు ప్రశాంత్, సంతోష్‌లపై ఫోక్స్ చట్టం కింద కేసులు నమోదు చేశారు.