గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి.. ప్రాణం తీసిన ఈత సరదా

by Sumithra |
young man died
X

దిశ, చౌటుప్పల్: గణేష్ నిమజ్జన శోభయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. నిమజ్జనం చేసేందుకు చెరువులోకి దిగిన యువకుడు మునిగిపోయి మృతిచెందాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల పరిధిలోని సరళమైసమ్మ దేవాలయం వద్ద చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్ ప్రాంతానికి చెందిన వంశీ(21) తన స్నేహితులతో కలిసి గణేష్ నిమజ్జనం కోసం గురువారం ఉదయం ఆరున్నరకు సరళ మైసమ్మ దేవాలయం వద్దకు వచ్చారు. అక్కడ చెరువులో వినాయకుని నిమజ్జనం చేశాక సరదాగా కాసేపు ఈత కొట్టారు. చెరువులో లోతైన ప్రదేశానికి వెళ్లిన వంశీ అక్కడే ఇరుక్కుపోయి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుధాకర్ రావు తెలిపారు.

Advertisement

Next Story