వేములవాడ దేవాలయంలో పూజలు రద్దు

by Sridhar Babu |   ( Updated:2021-04-15 08:08:15.0  )
వేములవాడ దేవాలయంలో పూజలు రద్దు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా సెకండ్​ వేవ్​ వ్యాపిస్తున్న నేపథ్యంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులకు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు దేవాదాయ శాఖ ప్రకటించింది. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు భక్తులకు దర్శనం, కోడె మొక్కులతో పాటు అన్ని పూజలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. భక్తుల రద్దీని నియంత్రించడం సాధ్యం కాలేదంటూ దేవాదాయ శాఖ పేర్కొంది. అదే విధంగా ఈ నెల 21న శ్రీరామ నవమి ఉత్సవాలు, భకోత్సవ కళ్యాణం, రథోత్సవం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా నేపథ్యంలో 18 నుంచి 22 వరకు భక్తులకు అనుమతి లేదని, ఆన్​లైన్​ ద్వారా పూజలు సమర్పించుకునే సదుపాయం ఉంటుందని దేవాదాయ శాఖ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed