- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మెడికల్ షాప్ లోకి చొరబడి యజమానిపై దాడి చేసిన దుండగులు

X
దిశ, గండిపేట్: మెడికల్ షాప్ యజమానిపై దాడి జరిగిన ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మణికొండ పరిధిలోని అరుణ మెడికల్ షాప్ కు వచ్చి జ్వరం గోలి ఇవ్వమని అడిగారు. ఇంతలోనే దుండగులు ఒక్కసారిగా అతనిపై దాడి చేశారు. మెడికల్ షాప్ లోకి చొరబడి యజమాని చెన్నారెడ్డి పై విచక్షణారహితంగా దాడి చేశారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ చెన్నారెడ్డికి తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. అకారణంగా తనపై దాడి చేశారంటూ నార్సింగి పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story