ఆలయాలకు విరాళం ఇవ్వాలనుకుంటున్నారా.. వారికోసం ప్రత్యేక యాప్

by Shyam |
Minister Indra Karan Reddy
X

దిశ, డైనమిక్ బ్యూరో: కరోనా కారణంగా ఆలయాలు మూసివేయడంతో రాష్ట్రంలోని ఆలయాలకు భారీగా ఆదాయం తగ్గింది. ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయిలో ఆలయాలు తెరుచుకోగా.. ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు దేవాదాయ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఎన్ఆర్ఐ భక్తుల నుంచి విరాళాలు రాబట్టేందుకు సిద్ధమైంది. ఆలయాలకు విరాళాలు ప్రకటించేందుకు ఇప్పటికే చాలామంది ఎన్ఆర్ఐలు ఆలయ అధికారులకు సంప్రదించారు. ఈ క్రమంలో వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా నేరుగా ఆన్లైన్ ద్వారా విరాళాలను డొనేట్ చేసేందుకు యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలంగాణ ఐటీశాఖ రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్‌ ‘‘T APP FOLIO’’ ను గురువారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. అయితే, ఈ యాప్‌లో ఎన్ఆర్ఐల కోసం ప్రత్యేకంగా ఆప్షన్‌ను తీసుకొచ్చారు. ఈ యాప్ ద్వారా ప్రస్తుతానికి యాదాద్రి, హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ, పెద్దమ్మ గుడి, సికింద్రాబాద్ గణేష్ టెంపుల్, కర్మాన్ ఘాట్ ఆలయాలకు విరాళం ఇవ్వొచ్చు. మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రంలోని మరిన్ని ఆలయాలకు దీని ద్వారా విరాళాలు పంపించొచ్చని మంత్రి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed