పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి : కలెక్టర్ వి పాటిల్

by Shyam |   ( Updated:2021-10-19 04:59:26.0  )
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి : కలెక్టర్ వి పాటిల్
X

దిశ, కామారెడ్డి: జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చీపురు పట్టి రోడ్లు ఊడ్చారు. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ క్లీన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మంగళవారం కామారెడ్డి మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీ గంజ్ లో పరిసరాలను శుభ్రం చేశారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గ్యార లక్ష్మి, వైస్ చైర్మన్ కుంబాల రవికుమార్, కౌన్సిలర్ అర్చన, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యులు చీపుర్లు పట్టుకొని పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు తమ ఇళ్లతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు రావని పేర్కొన్నారు. స్వచ్ఛత డ్రైవ్ లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు.

Advertisement

Next Story