- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపు బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. మూడు విడతల్లో 243 నియోజకవర్గస్థానాలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. 3,755 అభ్యర్థులు భవితవ్యం తేలనుంది. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. మొత్తం 38 జిల్లాల్లో 414 కౌంటింగ్ హాళ్లతో 55 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కరోనా కారణంగా భౌతిక దూరాన్ని పాటించడానికి ఒక కౌంటింగ్ హాల్‌లో ఏడు కౌంటింగ్ టేబుళ్లకు మించి ఉంచలేదు. తూర్పు చంపారన్, గయా, సివాన్, బెగుసరాయ్ జిల్లాల్లో మూడేసి కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మిగతా జిల్లాల్లో ఒకటి లేదా రెండు లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసింది.
ఫలితాల ప్రకటనలో ఆలస్యం?
కరోనా కారణంగా ఒక పోలింగ్ కేంద్రంలో ఓటేసి వారి సంఖ్యను ఎన్నికల సంఘం కుదించిన సంగతి తెలిసిందే. ఎక్కువ పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసి అందుకు అనుగుణంగా ఈవీఎంల సంఖ్యనూ పెంచింది. దీంతో గతంలో కంటే ఎక్కువ ఈవీఎంలను లెక్కించాల్సి ఉంటుంది. కాబట్టి ఫలితాల ప్రకటనలో గంటల వ్యవధిలో ఆలస్యం జరగవచ్చునని సంబంధితవర్గాలు తెలిపాయి.