మనిషికంటే కుక్క ప్రాణం ఎక్కువైంది

by Shyam |   ( Updated:2021-04-19 03:40:19.0  )
మనిషికంటే కుక్క ప్రాణం ఎక్కువైంది
X

దిశ, వెబ్ డెస్క్ : చాలా మంది పెంపుడు జంతువులను తమ కన్న బిడ్డల్లా చూసుకుంటారు. అలా ఓ నిరుపేద ఒక కుక్కను పెంచుకుంటున్నాడు. అయితే తాను ఆ కుక్కను కన్న బిడ్డకన్న ఎక్కువగా చూసుకుంటున్నాడు. ప్రపంచం అంతా తనను పట్టించుకోక పోయినా తన కష్టాల్లో, సంతోషాల్లో తోడుగా ఉండి తనను విడిచిపెట్టని కుక్క పట్ల ఎనలేని ప్రేమను పెంచుకున్నాడు. అయితే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అందరూ తప్పని సరిగా మాస్కు ధరించాలని చెబుతున్నారు.ఈ నేపథ్యంలో ఆ నిరుపేద దగ్గర ఒకటే మాస్కు ఉంది ఇంకో మాస్క్ కొనడానికి కూడా తన దగ్గర డబ్బులు లేవు దీంతో ఉన్న ఆ ఒక్క మాస్క్ ను కుక్కకు తొడిగాడు. అది చూసిన కొందరు అదేంటి మాస్కు కుక్కకు పెట్టావు అని అడిగితే.. ఇది నా బిడ్డ నాకు ఏం జ‌రిగినా ఫ‌ర్వాలేదు.. నా ప్రాణం పోయినా పర్లేదు.. కానీ దీనికి మాత్రం ఏం కాకూడదు..'నేను చ‌చ్చిపోయినా, నా కుక్కను మాత్రం చ‌చ్చిపోనివ్వను' అంటూ కుక్కకు మాస్క్ పెట్టి దాన్ని భజం పై ఎత్తుకోని పోతున్నాడు. దీంతో అతన్ని ఓవ్యక్తి ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ ఫొటో నెట్టింట్లో తెగ వైరల్ కావడంతో, నువ్వు దేవుడివి సామీ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed