విమానంలో అందరు చూస్తుండగా బట్టలు విప్పి.. ఏం చేశాడంటే..!

by Sujitha Rachapalli |
విమానంలో అందరు చూస్తుండగా బట్టలు విప్పి.. ఏం చేశాడంటే..!
X

దిశ, వెబ్ డెస్క్ : మనం ఎక్కడికన్నా ప్రయాణించేటప్పుడు మన తోటి ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తిస్తే ఎంత చిరాకు కలిగిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి సంఘటననే బెంగళూరు నుంచి న్యూ ఢిల్లీకి బయల్దేరిన ఎయిర్ ఏషియా విమానంలో చోటు చేసుకుంది. విమానం ఆకాశంలో ఉండగా ఉన్నట్టుండి ఓ ప్రయాణికుడు బట్టలు విప్పి సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడు. అతని ప్రవర్తన చూసి ఖంగుతిన్న సిబ్బంది కోపగించుకోవడంతో, తన సీట్లో కూర్చున్నాడు. అతను ఏమైనా మత్తు పదార్థాల సేవించాడేమోనని పరిశీలించగా, అదేమీ లేదనిసదరు ప్రయాణికుడు వెల్లడించాడు. ఆ తరువాత సిబ్బందికి క్షమాపణలు కూడా చెప్పాడు.

అతడి ప్రవర్తనతో విస్తుపోయిన సిబ్బంది..అలా కాసేపు శాంతంగా కూర్చున్నారు. కాసేపైన తర్వాత చూస్తే బట్టలు మళ్లీ విప్పి కూర్చొని ఉన్నాడు. సిబ్బంది మందలించగా తిరిగి బట్టలు వేసుకున్నాడు. విమానం ల్యాండ్‌ అయ్యే సమయంలో మరోసారి అలాగే వింతగా ప్రవర్తించడంతో అప్రమత్తమైన సిబ్బంది సెక్యురిటీ స్టాఫ్‌కి సమాచారం అందించారు. సెక్యురిటీ అదుపులోకి వెళ్లిన తర్వాత కూడా మరోసారి బట్టలు విప్పి నానా హంగామా చేశాడు. ఈ నేపథ్యంలో ఏఏఐకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎయిర్‌ఏషియా అధికారులు దీనిపై స్పందించి ఆ ప్రయాణికుడు మద్యం సేవించి ఉండొచ్చని భావిస్తున్నారు.

Advertisement

Next Story