- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కల’ నిజమైంది.. లాటరీలో భారీ జాక్‌పాట్ కొట్టిన పాకిస్తానీ..
దిశ, వెబ్ డెస్క్ : కలలు కనండి సాకారం చేసుకోండి అని మన పెద్దోళ్లు అంటుంటారు. అయితే ఇప్పుడు ఓ పాకిస్తానీ విషయంలో రాత్రి కన్న కల నాలుగు రోజుల్లో నిజమైంది. అంతే అతని ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. అబ్బో ఇదేం విచిత్రం అని అనుకుంటున్నారా ? అవునండీ నిజం. అబుదాబి లో ఉండే ఓ పాకిస్తానీ కి తెల్లవారు జామున ఒక కల వచ్చిందట. అదేంటంటే తాను రాత్రి కొన్న లాటరీకి కొట్లు వచ్చాయని, వాటిని తాను ఎలా ఖర్చు పెట్టాలి అని ఆలోచిస్తున్నట్టు వచ్చిందట. ఇక నిద్రలోంచి మేలుకొని చూస్తే అదంతా కల అని తెలిసింది. ఇక ఎలాగో కలలో కొట్లు వచ్చాయి కదా అనుకున్నాడో ఏమో అనుకున్నదే తడవుగా వెళ్లి అబుధాబి బిగ్ టికెట్ రాఫెల్‌లో ఓ లాటరీ టికెట్ కొనుక్కున్నాడు.
అంతే మనోడి దశ తిరిగింది. కరెక్ట్ గా నాలుగు రోజుల్లోనే విన్నర్ ని అనౌన్స్ చేశారు. ఇంకేముందు మనోడి కల సాకారం అయింది. కలలో కూడా ఊహించనంత డబ్బు ఇప్పుడు తన టికెట్ కు దక్కడంతో ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. ఏకంగా 15 మిలియన్ దిర్హామ్స్ (రూ.30.42కోట్లు) గెలవడంతో సంతోషంలో తేలుతున్నాడు.
పాకిస్తాన్ కి చెందిన షాహిద్ మహమూద్ 2007 నుంచి అబుధాబిలో పనిచేస్తున్నాడు. ఆరేళ్లుగా లాటరీలో టికెట్ కొంటుండేవాడు. అయితే ఎప్పుడూ తనకు రూపాయి రాలేదు. అయితే ఈ సారి మాత్రం లక్ష్మీదేవి కలలో వచ్చి ఇలలో తలుపు తట్టింది. అక్టోబర్ 30 న వేకువ జామున కల వచ్చింది అందులో 15 మిలియన్ దిర్హామ్స్ రావడం, దాంతో సెలబ్రేషన్స్ చేసుకోవడం ఇలా అన్నీ త్వరత్వరాగా గడిచిపోయాయి. అలాగే కల కూడా త్వరగా అయిపోవడంతో మెలకువ వచ్చింది.
తన సోదరుడికి ఫోన్ చేసి ఇదే విషయాన్ని చెప్పాడు. దాంతో సోదరుడు కూడా ఒక ఉచిత సలహా ఇవ్వడంతో ఉన్న ఫలంగా ఒక టికెట్ ను ఆన్ లైన్ లో కొనేశాడు. ఇంకేముందు బుధవారం నిర్వహించిన బిగ్ టికెట్ డ్రాలో షాహిద్ కొన్న టికెట్ కు లక్కి డ్రా తగిలింది. కొడితే ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టాలి అన్నట్టు జాక్ పాట్ కొట్టాడు షాహిద్. ఇక తన నలుగురు పిల్లల భవిష్యత్తు కోసం మొత్తాన్ని ఖర్చు చేస్తానని తెలిపాడు.