- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కుక్కను తప్పించబోయి భారీ ప్రమాదం.. ఆటో బోల్తాపడటంతో..

X
దిశ, పరిగి: వికారాబాద్ జిల్లా దోమ మండలం గొల్లపల్లికి చెందిన ఎల్లప్ప, పోచమ్మతో పాటు మరో ఐదుగురు మంగళవారం ఉదయం ఆటోలో కూలి పనికి బయలుదేరారు. బాస్ పల్లి హనుమాన్ టెంపుల్ సమీపంలో ఆటోకు కుక్క అడ్డం వచ్చింది. దాంతో డ్రైవర్ కుక్కను తప్పించబోయాడు, కానీ అంతలోనే ఆటో అదుపుతప్పి పల్టీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఎల్లప్ప(40) చేయి, కాలు విరిగింది. పోచమ్మ తల పగిలింది. మరో ఐదుగురికి రక్త గాయాలయ్యాయి. వీరిని వెంటనే 108 అంబులెన్స్ లో పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాలు విరిగిన ఎల్లప్ప ను మెరుగైన వైద్యం కోసం ఉస్మానియాకు తరలించారు
Next Story