బాంబుల ఫ్యాక్టరీగా పాతబస్తీ : రాజాసింగ్

by Ramesh Goud |   ( Updated:2021-06-29 06:12:58.0  )
MLA Rajasing
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని, దేశంలో ఎక్కడ పేలుళ్లు జరిగినా హైదరాబాద్ మూలాలు ఉంటాయని చెప్పారు. కొద్దిరోజులుగా సైలెంట్‌గా ఉన్న రాజాసింగ్ మంగళవారం ఒక్కసారిగా హాట్ కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇంటలీజెన్స్ విభాగం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. పాకిస్తాన్ నుంచి వచ్చే వారిపై నిఘా పెట్టడం లేదని మండిపడ్డారు. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసిపోయాక పాతబస్తీ బాంబుల ఫ్యాకరీగా మారిపోయిందని విమర్శించారు. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నగరంలో హాట్ టాపిక్‌గా మారాయి.

Next Story

Most Viewed