- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పిడుగుపడి ఇద్దరు రైతులు మృతి.. సంతాపం ప్రటించిన ఎమ్మెల్యే
by Sridhar Babu |

X
దిశ, వెబ్ డెస్క్: పిడుగుపడి ఇద్దరు రైతులు మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఉరుసు మల్లయ్య, అల్లపు రవి మరణించడంతో బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే సతీష్ కుమార్ సంతాపం ప్రకటించారు. అంతేగాకుండా.. ఆ కుటుంబాలను పరామర్శించాలని నేషనల్ లేబర్ బోర్డ్ డైరెక్టర్ దండుగుల రాజలక్ష్మిని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆమె, ఒక్కో కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేశారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూమిరెడ్డి ఎంపీటీసీ మల్లేశం ఉపసర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story