కరెంట్‌ పోల్‌పై బైక్… మెకానిక్ వినూత్న ఆలోచన

by Anukaran |   ( Updated:2020-08-27 06:50:58.0  )
కరెంట్‌ పోల్‌పై బైక్… మెకానిక్ వినూత్న ఆలోచన
X

దిశ, మధిర: ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందంటే ఇదేనేమో… ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలో ఓ మెకానిక్ కస్టమర్స్‌ను తన వైపుకు తిప్పుకునే విధంగా వినూత్న ఆలోచన చేశారు. తన వద్ద ఉన్నటువంటి పాత బైక్‌ను షాపు పక్కనే ఉన్నటువంటి ఐరన్ పోల్‌పై నిల్చోబెట్టడంతో అటుగా వెళ్లేవారు విచిత్రంగా చూస్తూ…

మెకానిక్ షాపు దగ్గర్లోనే ఉందంటూ కస్టమర్లు వస్తున్నట్టు చెబుతున్నాడు. తనకు వచ్చిన ఆలోచన ఎంతగానో ఉపయోగపడిందంటున్నారు. బోనకల్ మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన గోపి అనే మెకానిక్ ఈ ప్రయత్నం చేశారు. చిన్నప్పటినుండి మెకానిక్‌లో ఆసక్తి కనబరుస్తూ సొంతగా టూ వీలర్ మెకానిక్ షెడ్ ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నాడు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed