- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇంట్లో చొరబడి జవాన్‌ను హత్య చేశారు
by Sumithra |

X
దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు నక్సల్స్ మరో ఘాతుకానికి పాల్పడ్డారు. సుక్మా జిల్లా డోర్నపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెంట గ్రామానికి చెందిన వెట్టి భీమా అనే జవాన్‌ని హత్య చేశారు. జవాన్ ఇంటివద్ద ఉన్నాడనే సమాచారంతో మంగళవారం రాత్రి చొరబడ్డ సాయుధ నక్సల్స్ జవాన్‌ను మారణాయుధాలతో కొట్టి చంపినట్లుగా సమాచారం. కుటుంబ సభ్యులు అడ్డుపడి ప్రాధేయపడినా నక్సల్స్ వినిపించుకోలేదని తెలుస్తోంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. సమాచారం తెలియగానే భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story