- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పద్దతి మార్చుకోండి… మావోయిస్టుల హెచ్చరిక
దిశ ప్రతినిధి, వరంగల్: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం షాపల్లి గ్రామంలో మావోయిస్టు కరపత్రాలు కలకలం రేపాయి. ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతకు పోలీసు బలగాలతో అడవులను జల్లడ పట్టడం ఆపాలని వాల్ పోస్టర్‌లో పేర్కొన్నారు. కూంబింగ్స్ ఆపకుంటే టీఆర్ఎస్, బీజేపీ నాయకులకు భీమేశ్వరరావుకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. మాజీ మావోయిస్ట్ ముద్రబోయిన సంపత్ తన బొలేరో వాహనంలో పోలీసులను తిప్పడం పద్ధతి కాదని, ప్రజల చేతులో శిక్ష తప్పదని హెచ్చరించారు.
ఫారెస్ట్ అధికారులు డీఆర్వో ప్రహ్లాద్, రవిందర్, సందీప్‌లు ఇంకా చాలా మంది పద్ధతి మార్చుకోవాలని సూచించారు. కేసీఆర్ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం పేరుతో చేసేదేమీ లేదని, ప్రజలు సమస్యలు అడిగితే అక్రమ అరెస్టులు చేయిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను పెంచుతున్న కేసీఆర్ ప్రజలపై అక్రమ కేసులు పెడుతూ బలి చేస్తున్నాడని పోస్టర్‌లలో పేర్కొన్నారు.