- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
కేసీఆర్ ఇలాకాలో.. సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్‌చల్..

దిశ, గజ్వేల్: సెల్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి హల్‌చల్ చేసిన సంఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మజీద్ పక్కన గల టవర్ వద్ద గురువారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్‌కు చెందిన శంకర్ బీఈడీ చదివినా ఉద్యోగం రాలేదు. దీంతో బ్రతుకు దెరువు కోసమై ఉద్యోగ వేటలో భార్య పిల్లలతో కలిసి తిరుగుతున్నాడు. ఇంతలోనే సీఎం కేసీఆర్ ను కలిసి తన గోడును వెళ్లబోసుకుందామని ఆలోచనతో ప్రగతి భవన్ కు వెళ్లినా పోలీసులు అనుమతించలేదు.
ఇక చేసేదేమి లేదంటూ టవర్ ఎక్కి జై తెలంగాణ నినాదాలు చేశాడు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు యువకుడిని ఎలాగోలా నచ్చజెప్పి స్థానికుల సహాయంతో కిందికి దించారు. శంకర్ టవర్ దిగి రావడంతో అక్కడ ఉన్న స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో కథ సుఖాంతమయ్యింది.