చెరువులో పడి వ్యక్తి మృతి

by Shyam |
చెరువులో పడి వ్యక్తి మృతి
X

దిశ నర్సాపూర్: చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… నర్సాపూర్ మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన జబ్బర్(37) అనే వ్యక్తి ఉదయం ఇంటి పక్కనే ఉన్న చెరువులోకి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి మృతిచెందాడు. మృతుడు కొంతకాలం నుంచి మతిస్థిమితం లేక ఇంటివద్దనే ఉంటున్నట్టు అతని బాబాయి రసూల్ తెలిపారు. కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story