- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గొంతులో మాంసం ముక్క ఇరుక్కుని వ్యక్తి మృతి
by Sumithra |

X
దిశ, జడ్చర్ల: మహబూబ్‌నగర్‌జిల్లా మిడ్జిల్ మండలం లింభ్యాతాండ పంచాయతీ పరిధిలోని చేదు గుట్ట తండాలో జరిగిన శుభకార్యంలో అపశ్రుతి చోటుచేసుకుంది. విందు భోజనం చేస్తుండగా గొంతులో మాంసం ముక్క ఇరుక్కుని వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం రాత్రి చంద్రు నాయక్(59) అనే వ్యక్తి తమ తండాలోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లాడు. ఈ సందర్భంగా విందు భోజనం చేస్తుండగా గొంతులో మాంసం ముక్క ఇరుక్కుంది. దీంతో ఊపిరాడక చాలాసేపు ఇబ్బందిపడ్డాడు. అతడిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story