నా భార్య నాకు కావాలంటూ.. సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి

by Anukaran |   ( Updated:2021-04-11 06:03:43.0  )
నా భార్య నాకు కావాలంటూ.. సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి
X

దిశ, మంచిర్యాల: భార్య కాపురానికి రావడం లేదని ఒక వ్యక్తి బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. ఆదివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఆలేరు జనగమకు చెందిన సురేష్ అనే వ్యక్తికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే గత కొద్దీ రోజుల క్రితం సురేష్ తో గొడవ పడిన భార్య పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అతను ఎంతచెప్పినా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో మనస్థాపానికి గురైన సురేష్ ఆదివారం స్థానిక రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశాడు. తన భార్య, పిల్లలను పిలిపించి మాట్లాడాలని, వారిని తనతో ఇంటికి తీసుకురావడానికి ఒప్పించాలని, అప్పటివరకు తాను టవర్ దిగనని మొండికేసాడు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సురేష్ కి నచ్చజెప్పి కిందికి దింపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed