కడపలో లారీ బీభత్సం.. డ్రైవర్ మృతి

by srinivas |
కడపలో లారీ బీభత్సం.. డ్రైవర్ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లా ముద్దనూరులో ఓ లారీ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి రైల్వేగేటును ఢీకొని, ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. సదరు ఇల్లు ముందుభాగం పూర్తిగా ధ్వంసం అయింది. కుటుంబ సభ్యులందరూ ఇంటికెనుక గదిలో నిద్రిస్తుండటంతో భారీ ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకుంటున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, క్రేన్ల సాయంతో లారీని బయటకు తీస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.



Next Story

Most Viewed