నువ్వు మారవా? అంటూ తల బాదుకున్న హీరో అభిషేక్ బచ్చన్

by Shyam |   ( Updated:2021-11-21 04:23:48.0  )
abhishek-bacchan-1
X

దిశ, సినిమా: బాలీవుడ్ కొత్త సినిమాల ప్రమోషన్‌కు ‘ది కపిల్ శర్మ షో’ ఎప్పటి నుంచో పర్‌ఫెక్ట్ ప్లాట్‌ఫామ్‌గా నిలుస్తోంది. తాజాగా అభిషేక్ బచ్చన్, చిత్రాంగదా సింగ్ కూడా ఈ షోలో పాల్గొని హల్‌చల్ చేశారు. ఈ మేరకు తమ అప్‌కమింగ్ క్త్రైమ్ థ్రిల్లర్‌ ‘బాబ్ బిస్వాస్’ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే చిత్రాంగదా సింగ్.. ఓ పక్క షో జరుగుతుంటే, తను మాత్రం ఇన్‌స్టా రీల్స్ చేయడంలో బిజీగా ఉండిపోయిందట. ఈ విషయాన్ని గమనించిన అభిషేక్.. ఈ టైమ్‌లో ఇదేం పని, ఆపేయాలని సూచించాడట. కానీ అభిషేక్ మాటలను అంతగా పట్టించుకోని నటి.. షూటింగ్ కంప్లీట్ అవగానే మరో రీల్‌‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొద్ది సెకన్లలోనే ఈ వీడియోపై స్పందించిన అభిషేక్.. నువ్వు మారవా? అనే అర్థం వచ్చేలా తలకొట్టుకుంటున్న ఎమోజీని పోస్టు చేశాడు. అయితే ‘రీల్స్ చేయడం నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా!’ అంటూ జూనియర్ బచ్చన్‌కు రిప్లై ఇచ్చింది చిత్రాంగదా సింగ్.

బహిరంగంగా శృంగారం చేసుకోవొచ్చంటా.. ఎక్కడో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed