- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భార్య అలా చేస్తోందని పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టిన భర్త
దిశ, వెబ్‌డెస్క్ : ‘అత్త మీది కోపం దుత్త మీద’ చూపినట్టుంది ఇతడి వ్యవహారం. భార్య వేధింపులు భరించలేక ఆ కోపం పోలీస్ స్టేషన్‌పై చూపి జైలు పాలయ్యాడు. జైలుకు వెళ్లాకే అతడి మనసు రిలాక్స్ అయిందంటే అతిశయోక్తి కాదు. వినడానికి వింతగా ఉన్నా.. భార్యల వేధింపుల వల్ల భర్తలు ఎలా మారుతారో ఈ సంఘటన ఓ ఉదాహారణగా నిలిచింది. రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రాజ్‌కోట్ పట్టణంలోని రాజీవ్ నగర్‌కు చెందిన దేవీచావ్డ (23) అనే యువకుడికి ఇటీవలే ఓ యువతితో వివాహమైంది. కొత్త దంపతులు అయినా వారి సంసారంలో వెంటనే కలహాలు ప్రారంభమయ్యాయి. భార్య చీటికి మాటికి భర్తను వేధిస్తూ అతడికి మనశ్శాంతి లేకుండా చేస్తోంది. ఆమె పోరు భరించలేకపోయాడు భర్త. ఆమెతో కలిసి ఉండటంకన్న జైలుకు వెళ్లడం బెటర్ అనుకొని భజ్‌రంగ్ వాడి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. భార్య వేధింపులు తట్టుకోలేక పోతున్నానని, తనను అరెస్ట్ చేసి జైలుకు పంపాలని పోలీసులను కోరాడు. అయితే ఏ నేరం చేయని వాళ్లను అరెస్ట్ చేయమని, జైలుకు పంపడం కుదరదని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో బయటకు వచ్చిన దేవీ చావ్డ కిరోసిన్ తీసుకువచ్చి పోలీస్ స్టేషన్ ఔట్‌పోస్ట్‌పై పోసి నిప్పుపెట్టాడు.
వెంటనే అప్రమత్తమైన భజ్‌రంగ్ వాడి పోలీసులు ఔట్‌పోస్ట్‌కు పూర్తిగా మంటలు వ్యాపించక ముందే ఫైర్ ఇంజన్లతో అదుపు చేశారు. అయితే ఔట్‌పోస్ట్‌కు నిప్పు పెట్టిన దేవీచావ్డ మాత్రం అక్కడే ఉండి ఇప్పుడు నేరం చేశానని, తనను అరెస్ట్ చేయాలని పోలీసుల ముందు వాపోయాడు. వెంటనే అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆయన భార్యను పోలీస్ స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. కాగా, ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికి ఏమి కాలేదని, పోలీసులు అప్రమత్తంగా ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని గాంధీగ్రామ్ సీఐ కుమాన్ సిన్హ్ తెలిపారు. మరోవైపు దేవీచావ్డను ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన కేసులో అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అతడికి ఐపీసీ సెక్షన్ 436 ప్రకారం పదేళ్ల వరకు శిక్ష లేదా ఫెనాల్టీ విధించే అవకాశం ఉన్నదని సీఐ కుమాన్ సిన్హ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటన రాజస్థాన్‌లో హాట్ టాఫిక్‌గా మారింది. నూతన దంపతులు చేసిన పనికి నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు.