- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
స్థలం పేపర్లు కల్నల్ సంతోష్‌బాబు ఫ్యామిలీకి అప్పగింత
by Shyam |

X
దిశ సూర్యాపేట: సరిహద్దులో పోరాడుతూ అమరుడు అయిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం చేయూతనిచ్చింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు బుధవారం హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో కేబీఆర్ పార్కుకు ఎదురుగా రూ. 20 కోట్ల విలువైన 711 గజాల ఇంటి స్థలం కేటాయించారు. బుధవారం ఉదయం ఆ స్థలానికి సంబంధించిన పేపర్స్ కల్నల్ సంతోష్ బాబు భార్యకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అందజేశారు. షేక్ పేట్ మండలంలో మూడు స్థలాల్లో ఇష్టం వచ్చిన స్థలాన్ని కోరుకోవాలని ప్రభుత్వం సూచించింది. కల్నల్ సంతోష్ కుటుంబ సభ్యుల కోరిక మేరకు బంజారాహిల్స్ లో స్థలం కోరుకోగా ఆ ఇంటి స్థలాన్ని ప్రభుత్వం కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి కేటాయించింది. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
Next Story