చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది: రాఘవులు

by Shamantha N |   ( Updated:2020-12-02 06:11:40.0  )
చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది: రాఘవులు
X

దిశ, వెబ్ డెస్క్: రైతులకు మద్దతుగా దేశ వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన చేపడుతామని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. రైతుల ఆందోళనకు మద్దతుగా జంతర్ మంతర్ వద్ద వామపక్షాలు బుధవారం నిరసన తెలిపాయి. నిరసన ప్రదర్శనలో వామపక్షాల, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీపీఎం నేత బీవీ రాఘవులు మాట్లాడుతూ…చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆయన అన్నారు. మద్దతు ధర ఇవ్వడానికి సిద్దమని చెబుతూ చట్టంలో చేర్చలేదని చెప్పారు. మద్దతు ధరపై ప్రత్యేకంగా చట్టం తీసుకు రాలేదని అన్నారు. ఉద్యమాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

Next Story

Most Viewed