‘హరిత నిధి’కి కమిటీ ఏర్పాటు.. ఇక శాలరీల్లో కోత!

by Shyam |   ( Updated:2021-12-16 09:25:17.0  )
Haritha nidhi
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘తెలంగాణకు హరితహారం’ గత ఏడేళ్లుగా దిగ్విజయవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ మహత్తర కార్యక్రమంలో ప్రభుత్వంతో పాటు ప్రజలు భాగస్వామ్యం కావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ‘హరిత నిధి’ పేరిట ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అందరూ ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థలు, ఎన్జీవోలు, విద్యాసంస్థలు, ప్రజా సంగాలు, ప్రజా ప్రతినిధుల నుంచి ఫండ్‌ను కలెక్ట్ చేసేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా రెండు నెలల క్రితం ప్రకటించారు. అయితే, దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో ప్రకారం విరాళాల సేకరణను పర్యవేక్షించేందుకు అటవీశాఖ మంత్రి చైర్మన్‌గా ఉంటూ స్టేట్ లెవెల్ కమిటీ ఏర్పాటు చేశారు. అందులో వైస్ చైర్పర్సన్‌గా స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఫారెస్ట్, కన్వినర్ గా పీసీసీఎఫ్(హెచ్ఓఎఫ్ఎఫ్), మరో నలుగురు మెంబర్లుగా ఉండనున్నారు. సేకరించిన ఫండ్‌తో నర్సరీల ఏర్పాటు, మొక్కలను నాటడం, నాటిన మొక్కలను నీటి సరఫరా, ప్లాంట్ ప్రొటెక్షన్, అవగాహన కార్యక్రమాలు ఇతర పనులకు వీటిని వినియోగించనున్నారు.

హరిత నిధికి తమ వంతుగా..

రూ.500 ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు
రూ.100 జడ్పీ చైర్మన్లు, మున్సిపల్‌ మేయర్లు
రూ.50 మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌, ఎంపీపీ, జెడ్పీటీసీలు
రూ.10 మున్సిపల్‌ కౌన్సిలర్లు, గ్రామ సర్పంచ్‌, ఎంపీటీసీ, కార్పొరేటర్లు

అఖిల భారత సర్వీసులు :

రూ.100 ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారులు
రూ.25 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి
0.1% ప్రభుత్వ పనులు చేపట్టే సివిల్‌ తదితర కాంట్రాక్టు నిధుల్లోంచి
10% నియోజకవర్గ అభివృద్ధి నిధి నుంచి
రూ.50 ప్రతి రిజిస్ట్రేషన్‌ నుంచి
రూ.1000 వ్యాపార సంస్థల ప్రతి లైసెన్సు రెన్యువల్‌ నుంచి

విద్యార్థుల అడ్మిషన్ల నుంచి…

రూ. 10 ప్రతి సూల్‌ అడ్మిషన్‌కు
రూ. 15 ఇంటర్మీడియట్‌ అడ్మిషన్‌కు
రూ. 25 డిగ్రీ అడ్మిషన్‌కు
రూ. 100 ప్రొఫెషనల్‌ కాలేజీ అడ్మిషన్‌కు

Haritha nidhi 2021EFST_RT139

Advertisement

Next Story