క్రిస్మస్ కు భారీ షాక్.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..

by Anukaran |   ( Updated:2021-12-22 08:22:30.0  )
క్రిస్మస్ కు భారీ షాక్.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..
X

దిశ, వెబ్ డెస్క్: దేశం మొత్తం క్రిస్మస్ పండుగకు ఏర్పాట్లు చేసుకుంటోంది. కానీ ఒమిక్రాన్ వల్ల చాలా దేశాలు ఇప్పటికే ఆంక్షలు మొదలు పెట్టాయి. తాజాగా మన దేశంలోని పలు రాష్ట్రాలు కూడా ఇప్పుడు ఇదే బాట పట్టాయి. కేవలం క్రిస్మస్ మాత్రమే కాదు న్యూయర్ సెలబ్రేషన్స్ కు కూడా చెక్ పెట్టేస్తున్నాయి. ఢిల్లీ సర్కార్ సైతం ఇప్పుడు అదే బాటలో పయనిస్తోంది.

క్రమంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. క్రిస్మస్ తో పాటు న్యూయర్ వేడుకలపై కూడా నిషేధం విధించింది. మాస్క్ పెట్టుకోని వారిని ఎలాంటి వ్యాపార సముదాయాల్లోకి రానీయకూడదని ఆర్డర్ పాస్ చేసింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు డబుల్ సెంచరీ దాటాయి.

అందులో దాదాపు 90 శాతానికి పైగా కోలుకున్నా, వ్యాప్తి మాత్రం కంట్రోల్ కావడం లేదు. దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు వ్యాప్తి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ వేరియంట్ వ్యాప్తి అన్నిటికంటే మూడు రెట్లు ఉండటం ఇప్పుడు అందరికి ఆందోళన కలిగిస్తోంది.

Advertisement

Next Story