ఇంటర్​ ఫస్టియర్ ​ప్రవేశాలకు ఈనెల 12 వరకు గడువు

by Shyam |
intermediate students
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్ ఫ‌స్టియ‌ర్ ప్రవేశాల గ‌డువును ఈ నెల 12వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, కో ఆప‌రేటివ్, టీఎస్ రెసిడెన్షియ‌ల్, టీఎస్ సోష‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్, ట్రైబ‌ల్ వెల్ఫేర్, మోడ‌ల్ కాలేజీలు, బీసీ, మైనార్టీ వెల్ఫేర్, కేజీబీవీ, ఇన్సెంటివ్, కంపోజిట్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు పొందొచ్చని పేర్కొంది. తెలంగాణ ప్రైవేట్ ​జూనియ‌ర్ కాలేజీ మేనేజ్‌మెంట్​ అసోసియేష‌న్ విజ్ఞప్తి మేర‌కు ఈ గడువు పొడిగించినట్లు ఇంట‌ర్ బోర్డు స్పష్టం చేసింది.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story