- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జాతీయ రహదారిపై మొసలి హల్‌చల్ (వీడియో)

X
దిశ, మక్తల్: నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణా మండలంలోని సరిహద్దు చెక్‌పోస్టు వద్ద మొసలి హల్‌చల్ చేసింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర సరిహద్దులోని రాయచూర్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న చెక్‌పోస్ట్ వద్దకు కృష్ణానది నుంచి ఓ భారీ మొసలి జాతీయ రహదారిపై వచ్చి సేద తీరింది. దీనిని గమనించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వాహదారులు సైతం ఎక్కడివాహనాలు అక్కడ నిలిపివేశారు. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు మొసలిని మళ్లీ నదిలోకి పంపించారు. దీంతో వాహనదారులు, పాదాచారులు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story